కూరగాయలు అమ్ముకుంటున్న నటుడు… ఇదంతా ప్రియాంకతో కలిసి నటించడం వ‌ల్లేన‌ట‌..!!

గ్లామర్ వరల్డ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యేందుకు రోజుకు వేలాదిమంది ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఎన్నో స్ట్రగుల్స్ తరువాత స్క్రీన్ పై మెరుస్తున్నారు. కొంతమందికి అదృష్టం కలిసి రావడంతో లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలోనే కంటిన్యూ కూడా అవుతున్నారు. మరికొంతమంది మాత్రం అవకాశాలు లేక వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ నేపద్యానికి చెందిన వాడే నటుడు షోలంకి దివాకర్.

ప్రియాంక చోప్రా, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావ్‌ లాంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం పండ్లు, కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈయన కెరీర్ స్టార్టింగ్ లో థియేటర్స్‌లో పాపడ్స్ అమ్ముకునేవాడు. ఈ క్రమంలో సినిమాపై ఆసక్తి కలగడంతో.. ముంబై ట్రైన్ ఎక్కి వచ్చి.. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అనంతరం ఈయనకు.. డ్రీమ్ గర్ల్ , సోంచిరియా, ది నైట్ టైగర్ సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

ఇక అనంతరం రిషి కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. కానీ రెండు, మూడు సార్లు షూటింగ్ డేట్స్ చేంజ్ అవ్వడం, ఫైనల్ గా చిత్రీకరణ పూర్తికాకుండానే ఆయన హెల్త్ ఇష్యూస్ తో చనిపోవడం జరిగింది. కాగా ఇది తన లైఫ్ లో పెద్ద రీగ్రేట్ అని చెప్పాడు సోలంకి. ఈ వార్త చదివిన ప్రేక్షకులు…” ఇది అంతా ప్రియాంక చోప్రా పుణ్యమే అంటూ ” నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.