సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెసేజ్ ఓరియంటెడ్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించిన సినిమాలను తీయడంలో తన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు శంకర్. ఇక శంకర్ కూతురు అదితి శంకర్ వృతి రిత్యా డాక్టర్ అయినా.. తమిళ్ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస సక్సస్‌లతో రాణిస్తుంది. అంతేకాదు అదితి శంకర్ మంచి సింగర్ కూడా. అదితి ఇప్పటికే వీరుమాన్, మావీరన్ లాంటి సినిమాల్లో నటించి సక్సెస్ అందుకుంది.
ఇక ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా అదితి శంకర్ రెండేళ్ల క్రితం మెడిసిన్ పూర్తిచేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2021 లో అదితి శంకర్ డాక్టర్‌గా అఫీషియల్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకుంది. ఈ నేపథ్యంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇకనుంచి నేను డాక్టర్.అదితి శంకర్ అని ఆమె తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. శంకర్ కూతురు డాక్టర్‌గా వృత్తి ప్రారంభిస్తుంది అనుకుంటే.. 2022లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక నటిగానే కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డాక్టర్ సర్జరీ చేసే సమయంలో ధరించే గ్రీన్ డ్రెస్ లో మాస్క్ తో ఉన్న పిక్ ఆమె షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు DR.A అని కామెంట్ పెట్టింది. దీంతో అదితి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టిందని.. ఇక తన వృత్తిలో కొనసాగాలని ఆమె భావిస్తుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే అదితి నిజంగానే డాక్టర్ వృత్తిలో కంటిన్యూ అవ్వాలనుకుంటుందా.. లేదా ఏదైనా సినిమా కోసం ఆమె ఆ గెటప్ లో ప్రత్యక్ష అయిందా అనే సందేహాం నెట్టిజన్లలో మొదలైంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అదితినే స్పందించాలి. ఇక దీనిపై ఆమె ఏ విధమైన క్లారిటీ ఇస్తుందో చూడాలి.