బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్…?

వరుస సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలకు ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మన నట సింహం నందమూరి బాలకృష్ణ. “అఖండ” చిత్రంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు. తరువాత వచ్చిన “వీర సింహ రెడ్డి” చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇప్పుడు వరుసగా తదుపరి ప్రాజెక్టులను లైన్ అప్ చేసారు. పిచ్చి పిచ్చి కథలు కాకుండా మంచి పాత్రలు, మంచి కథ ఉన్న చిత్రాలకు మాత్రమే ఓకే చెప్తున్నారు. బాలయ్య తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించనున్నాడు. వాల్తేర్ వీరయ్య చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న బాబీ, బాలయ్యతో చెయ్యబోయే చిత్రం పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మొదటి చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యే మొదలయినట్టు తెలుస్తోంది.

ఇది బాలయ్య కెరీర్ లో 109 వ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెరవేగంగా సాగుతోంది. ఐతే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక కొత్త రూమర్ వినిపిస్తోంది. అదేమిటంటే…. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో ఒక్క ముఖ్యపాత్రలో నటించబోతున్నాడట. మల్టీ స్టారర్ చిత్రంలో నటించేందుకు బాలయ్య కూడా పచ్చ జండా ఊపినట్టు సమాచారం. ఐతే ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ రూమర్ లో ఎటువంటి నిజం లేదని, ఇప్పటివరకు ఈ సినిమాలో మరే యంగ్ హీరో పాత్ర లేదని అంటున్నారు మూవీ టీం. బాలయ్య వర్గం కూడా ఈ వార్తను కొట్టిపడేసింది. మరోవైపు దుల్కర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కింగ్ అఫ్ కొత్తా చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్, ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో వస్తున్న “తగ్ లైఫ్” చిత్రంలో నటిస్తున్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా దుల్కర్ ఒక్క ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

ఇక పోతే బాబీ, బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.