కోలీవుడ్ హీరో కార్తీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ” జపాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ అనుకున్నంత ఫలితం దక్కకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఓపెనింగ్ షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న..” జపాన్ ” సినిమాకి దాదాపుగా రూ. 27 కోట్లకు పైగా నష్టం రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఇదిలా ఉండగా.. జపాన్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ కార్తీ ఏమాత్రం టెన్షన్ పడకుండా రిలాక్స్ గా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఏ హీరో అయినా సినిమా డిజాస్టర్ అయితే అందులో నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది.
కానీ కార్తీ మాత్రం వెంటనే తన 27వ సినిమాకు సైన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ” 96 ” తో ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తో సినిమా షూటింగ్ ఈరోజే ప్రారంభం చేయనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాని సూర్యకు చెందిన 2డి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాతో అయినా కార్తీక్ సక్సెస్ అయి సినిమా రంగంలో కొనసాగుతాడో.. లేదో చూడాలి మరి.