నందమూరి బాలకృష్ణ హీరో గానే కాకుండా హోస్ట్ గా కూడా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు.. ప్రముఖ ఓటీటి సంస్థ ఆహాలో నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకి బాలయ్య హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మూడవ సీజన్ కి సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ తో ప్రారంభించారు. అన్ స్టాపబుల్ -3 మొదటి గెస్ట్లుగా బాలయ్య భగవంత్ కేసరి చిత్ర బృందాన్ని తీసుకువచ్చి సందడి చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా రెండో ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను కూడా విడుదల చేశారు ఆహా సంస్థ.
ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రష్మిక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హాజరు కావడం జరిగింది. బాలకృష్ణ ఈసారి డబుల్ ఎనర్జీతో కనిపించారు. ముందుగా సందీప్ రెడ్డిని పిలిచి ఆయనతో సరదాగా మాట్లాడారు సాయంత్రం ఏంటి అని బాలయ్య అడగగానే ఓన్లీ విస్కీ సార్ అనే సమాధానాన్ని తెలుపుతారు.. ఇక తర్వాత రణబీర్ కపూర్ తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇస్తారు.. ముఖ్యంగా బాలయ్య డైలాగులు సైతం రణబీర్ నోట వినడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇక రష్మిక చీర కట్టు కి అందానికి సైతం బాలయ్య ఫిదా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత విజయ్ తో మాట్లాడుతున్న సమయంలో రష్మిక ముఖంలో చాలా ఆనందం కనిపిస్తూ ఉంటుంది.. ప్రస్తుతం అందుకు సంబంధించి ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది.చివరిలో రణబీర్ కపూర్ బాలయ్య ట్రబుల్ డైలాగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.. ఇందుకు సంబంధించి ఫుల్ ఎపిసోడ్ కావాలి అంటే నవంబర్ 24 వరకు వేచి ఉండాల్సిందే..