నేడు నయన్ బర్తడే… స్పెషల్ ఏంటో తెలుసా…!!

స్టార్ హీరోయిన్ నయనతార మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 40 ఏళ్లు మీద పడుతున్న… 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. ఇక ఈ బ్యూటీ కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేయడం మొదలు పెట్టింది. మలయాళం డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ” మనస్సినక్కరే ” అనే సినిమా ద్వారా నయనతార హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

అనంతరం అనేక సినిమాలతో దూసుకుపోయింది. ప్రతి అగ్ర హీరో సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకులం ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక నేడు నయనతార పుట్టినరోజు. 1984 నవంబర్ 18న ముంబైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. నేటితో 38 ఏళ్లు పూర్తిచేసుకుని 39లో కి అడుగు పెట్టింది.

ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా పలు సెలబ్రిటీలు సైతం విషెస్ తెలియజేస్తున్నారు. ఇక నయనతార కి ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజనే చెప్పాలి. ఇక నేడు నయన్ బర్తడే సందర్భంగా.. తన ఫోటోలను.. ఈమె నటించిన సినిమాల‌లో వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తున్నారు ఈమె ఫ్యాన్స్.