బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ” కాఫీ విత్ కరణ్ ” షో లో సౌత్ ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
రాపిడ్ రౌండ్ లో ” ఏ సౌత్ హీరోతో జతకట్టాలని అనుకుంటున్నావు?… ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యష్.. వీరిలో ఎవరితో నటించాలని అనుకుంటున్నావు ” అని కరణ్ జోహార్ ప్రశ్నించగా… కరీనా కపూర్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా యష్ అని చెప్పేసింది. తనకు తాను ” కేజిఎఫ్ గర్ల్” గా గర్వంగా ప్రకటించుకుంది. ఇక దీంతో యష్ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
” యష్ స్టార్డమ్ లోకల్ టు ఇంటర్నేషనల్.. అది అందరిని ఫిదా చేస్తుంది” అంటూ మురిసిపోతున్నారు. ఇక ఈ నేపద్యంలోనే రవితేజ, అల్లు అరవింద్ యష్ పై చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ” కే జి ఎఫ్ ” సినిమా లేకపోతే యష్ కు ఇంత స్టార్డమ్ లేదని.. ఇదంతా లక్ అన్నట్లుగా చేసిన కామెంట్లను.. కరీనా ” కేజిఎఫ్ గర్ల్” గా ప్రకటించుకోవడంతో పోలుస్తున్నారు. ప్రస్తుతం కరీనా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.