బిచ్చగాడు మూవీ హీరోయిన్ సత్నా టైటస్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సట్నా టైటాన్స్ అంటే తెలియ‌క పోవ‌చ్చు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా హీరోయిన్ అన‌గానే ఠ‌కున గుర్తుకొస్తుంది. ఈ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో డి గ్లామరస్ లుక్‌తో హోమ్లీ బ్యూటీగా కనిపించిన సత్నా తను నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా సక్సెస్ తో స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో వెలుగు వెలుగుతుంది అనుకున్న వారందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. బిచ్చగాడు మూవీ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన కార్తీక్ ను ప్రేమించి కెరీర్ ను పక్కన పెట్టేసింది. వచ్చిన అవకాశాలను వదులుకుంటూ కార్తీక్ తో ప్రేమలో మునిగి తేలిన సత్నా.. వీరిద్దరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. కొంతకాలానికి వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులు వారి సమక్షంలో గ్రాండ్గా మళ్లీ వివాహం చేశారు.

ఇక వీరిద్దరి వివాహం తర్వాత సత్నా టైటస్‌ కేవలం శ్రీ విష్ణు తో కలిసి నీది నాది ఒకే కథ సినిమాలో మాత్రమే నటించింది. ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోకపోవడంతో తర్వాత ఈమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె ఇంటి పట్టే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Satna Titus (@satnatitusofficial)