వాటికి కకృతి పడి కెరియర్నే నాశనం చేసుకుంటున్న పూజా హెగ్డే..!!

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ అమ్మడు చివరిగా తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్ వంటి చిత్రాలను నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కి జోడిగా ఒక చిత్రంలో నటించిన అది ఫ్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం ఈమె చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవి లేవు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఒక చిత్రంలో ఈమె నటించడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది రెండు సినిమాలలో పూజా హెగ్డే అవకాశాలు కోల్పోయింది.ముఖ్యంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం చిత్రంలో ముందుగా ఈమెను అనుకోగా షూటింగ్ కూడా మొదలయ్యే సమయానికి డేట్స్ సైతం అడ్జస్ట్ కావడంతో తీసుకున్నారు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా ఈమెను తప్పించారు. అయితే ఇదంతా కేవలం రెమ్యూనరేషన్ విషయంలో ఇమేను సినిమాలు నుంచి తొలగించడానికి ఒక కారణం అనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

టైర్-2 హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు మాత్రం పూజా హెగ్డే అని హీరోయిన్గా తమ సినిమాలలో తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా తనతో వచ్చే వారికోసం ఎక్స్ట్రాగా మరో కోటి రూపాయలు వరకు నిర్మాతలకు ఖర్చవుతుందని ఇది అదనకు భారంగా పడడంతో ఈమె హీరోయిన్ గా తీసుకోవడానికి దర్శక నిర్మాతలు విరమించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమెకు వచ్చిన చాన్సులన్నీ కూడా శ్రీ లీల, మృ ణాల్ ఠాకూర్ కి వెళ్ళిపోతున్నట్లు సమాచారం. కేవలం రెమ్యూనరేషన్ కారణంగా పూజా హెగ్డే ఇలా అవకాశాలను కోల్పోతుందని చెప్పవచ్చు.