15 ఏళ్లకే టాలీవుడ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న నటులు వీళ్లే..

ఎప్పటికప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్ అడుగు పెడుతూనే ఉన్నారు. ఏడాదికి దాదాపు ముగ్గురు నుంచి నలుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వారి అదృష్టను పరీక్షించుకుంటూ నే ఉన్నారు. అయితే తమ 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ లోకి పెట్టి స్టార్ హీరోయిన్స్ గా మారిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో ఒకసారి చూద్దాం.

రమ్యకృష్ణ :


సీనియర్ యాక్టర్ రమ్యకృష్ణ. భ‌లేమిత్రులు సినిమాతో తన 15 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇప్పటికి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా గడుపుతుంది.

హన్సిక :


సౌత్ స్టార్ బ్యూటీ హన్సిక మోత్వాని అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లో నటించే సమయానికి హన్సిక వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే.

తమన్నా :


మిల్కీ బ్యూటీ తమన్న టాలీవుడ్లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాక బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ శ్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో నటించే సమయానికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అప్పుడు ఆమె టెన్త్ క్లాస్ చదువుతుందట.

లక్ష్మీ రాయ్ :


టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన లక్ష్మీరాయ్ కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో నటించే సమయానికి అమే వయస్సు 15 ఏళ్లు మాత్రమే.

చార్మి :


టాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఛార్మి నీ తోడు కావాలి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో న‌టిమ‌చే సమయానికి ఆమె వయసు కూడా 15 సంవత్సరాలు. ఇలా చాలా మంది హీరోయిన్స్ త‌మ చిన్న వ‌య‌స్సులోనే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి స‌క్స‌స్ అందుకున్నారు.