అరటికాయతో బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి.. తింటే వ‌ద‌ల‌రు..!!

చాలామంది అరటికాయతో కూర, బజ్జి లాంటివి వేసుకుంటూ ఉంటారు. కానీ వెరైటీగా ఈ డిష్ ట్రై చేస్తే బాగుంటుంది. ఈ బ‌నాన ఫింగ‌ర్ క‌ట్‌లెట్‌లా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

• అరటికాయలు రెండు (మీడియం సైజువి, ముక్కలుగా ఉడికించి, తొక్క తీసి, చక్రాలకు మధ్యలో ఉండే గింజలను తొలగించి, ముక్కలు గుజ్జులా చేసుకోవాలి).

• అటుకులు-అర కప్పు (కొన్ని నీళ్లలో నానబెట్టి, పేస్ట్ లా చేసుకోవాలి)

• కొత్తిమీర తగినంత, జొన్న పిండి పావు కప్పు, జీలకర్ర అర టీ స్పూన్

• జీడిపప్పులు 10 (నానబెట్టి పేస్టులా చేసుకోవాలి)

• చాట్ మసాలా అర టీ స్పూన్

• కారం అర టీ స్పూన్

• పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తగినంత

• నూనె సరిపడా, ఉప్పు తగినంత.

తయారీ విధానం:
ముందుగా అరటికాయ గుజ్జు, అటుకుల పేస్ట్ వేసుకుని దానిలో కారం, చాట్ మసాలా, జొన్నపిండి, తగినంత ఉప్పు, జీలకర్ర, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలపాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇతర కూరగాయల ముక్కలు వంటివి కలుపుకోవచ్చు. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి ఫింగర్స్ లా, పొడవుగా చిత్రంలో ఉన్న విధంగా ఒత్తుకొని నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటే ఆ రుచే వేరు.