పడుకునే ముందు యువత ఏం ఆలోచిస్తారో తెలుసా..?

యువత నిద్రకు ఉపక్రమించే ముందు ఏం ఆలోచిస్తుందన్న ఆలోచన వినడానికే ఆసక్తిగా ఉంది కదూ. పరిశోధకులకు కూడా ఇదే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ సంస్థ 2000 మంది అడల్ట్స్ పై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి. వీరిలో సుమారు 45% మంది నెక్ట్స్ డే తమ షెడ్యూల్ గురించి ఆలోచిస్తారని తెలిసింది.

ఉదయం లేవగానే ఏం చేయాలనే ఆలోచనతో పడుకుంటారట. ఇక 44% మంది యువత తమ జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తారట. పెళ్లి కానీ వాళ్లు తమకు కాబోయే వరుడు గురించి ఆలోచిస్తూ పడుకుంటారని తెలిసింది. 36% మంది తము చేసే వృత్తికి సంబంధించిన అంశాల గురించి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమిస్తారని సర్వేలో వెల్లడయింది. ఇక 27 నుంచి 42 ఏళ్ల వయసున్న వారు రోజంతా తాము గడిపిన ఇష్టమైన క్షణాలను ఆలోచిస్తూ నిద్రపోతారట.

ఇక 43 నుంచి 58 ఏళ్ళు వయసులో ఉన్నవారు తదుపరి రోజు గురించి పెద్దగా ఆలోచించరని తెలిసింది. 38 శాతం మంది మాత్రం తమ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారట. 24 ఏళ్లు లోపు వయసులో 68% మంది స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకునే నిద్రపోతుంటారు. అలాగే 47% మంది డ్రెస్ మార్చుకోకుండానే నిద్రపోతున్నారని తేలింది.