ఇంటి చిట్కాల‌తో శ‌రీరంపై న‌లుపు మ‌టుమాయం.. ఇక ర‌మ్మ‌న్నా రాదు…!

సాధారణంగా మనలో చాలామందికి కంటి నలుపు ఉంటుంది. దీనితో నలుగురిలోకి వెళ్లాలంటే అవి కనపడకుండా అనేక క్రీములు రాస్తూ ఉంటారు. కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు పాటించిన నల్లటి మచ్చలు పోవు. ఈ సమస్యకు సింపుల్ చిట్కాతో పుల్ స్టాప్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

• టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి‌. ఆరిన తర్వాత కడగాలి.

• రోజ్ వాటర్ లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. ఇలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజు వాటర్ కలిపి రాయలి.

• అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్ళ కింద ముఖమంతా రాసి ఆడిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

• ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నేరుగా ముఖంపై బాగా రబ్ చేయాలి. తర్వాత 30 నిమిషాలు ఆగి గోరువెచ్చని నీళ్లతో మొహాన్ని కడగాలి.

• ఒక టీ స్పూన్ బొప్పాయి రసం, అంతే మోతాదులో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమాన్ని మొహానికి రాయాలి. దీన్ని రాస్తుంటే మీ చేతులు మోకాళ్లపై ఉండే నలుపుదనం పోగొడుతుంది.