వరల్డ్ వైడ్ “ జైలర్ ” డే 1 వసూళ్ల అంచనాలు ఇన్ని కోట్లా..!

కోలీవుడ్ తలైవా.. టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమన్నా హీరోయిన్గా నెల్సన్ దిలీప్ కుమ‌ర్‌ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా జైలర్. కొంతసేపటి క్రితం ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కి ముందే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ స్పీచ్ అలాగే మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్ని సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ఆడియ‌న్స్‌లో మంచి హైప్‌ వచ్చింది.

ఈ సినిమా టాలీవుడ్ లో కూడా రోబో రేంజ్‌లో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని రజిని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఫస్ట్ రోజు భారీ ఓపెనింగ్స్ ఉండవచ్చని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తాజా అంచ‌నాల‌ ప్రకారం ఈ సినిమా ఈజీగా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ లను వసూలు చేయబోతుందని తెలుస్తుంది.

 

టాలీవుడ్‌లో ఇంత‌క‌ముందు రిలీజ్ అయిన రజిని 3 సినిమాలు అంతగా ఆడక పోవడంతో రజినీకాంత్ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ ఇటీవల రిలీజైన జైల‌ర్‌ ట్రైలర్ తో టాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మన తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా మరి ఏ రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతుందో చూడాలి.