ప్రేమ అనేది రెండు మనసుల మధ్య పుడుతుంది. ఆ ప్రేమ పెళ్లిపీటల వరకూ వస్తే ఆ ఆనందం మాటలో చెప్పలేనిది. అయితే సాధారణ వ్యక్తుల నుండి సెలబ్రిటిల వరకూ ఎవరయినా ప్రేమలో పడితే ఆ బంధానికి ఎలాంటి తేడాలు ఉండవు. ఇక ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆ అనుభూతిని అనుభవించింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇటీవలే వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే వారి పెళ్ళికి తక్కువ మందిని ఆహ్వానించారు. రెసెప్షన్ మాత్రం సెలబ్రిటీల కోలాహలం మధ్య చేసుకున్నారు. అయితే తాజాగా ఈ ప్రేమ జంట ఒక్క అవార్డ్స్ ఫంక్షన్‌కి హాజరయ్యారు. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి వెళ్లిన మొదటి ఫంక్షన్ అదే. ఈ సందర్బంగా కియారా తన పెళ్లి సమయంలో జరిగినా కొన్ని సంఘటనలు అభిమానులతో పంచుకుంది.
“పెళ్లి సమయంలో నేను ఎంతో ఎమోషనల్ అయ్యాను. నా హృదయం మొత్తం పట్టలేని సంతోషంతో నిండిపోయింది. పెళ్లి మండపంలో సిద్ధార్థ్ ని చూడగానే ‘యహు నాకు పెళ్లి అయిపోతుంది’ అని మనసులో గట్టిగా అనుకున్నాను. ఈ అందమైన అనుభవం ప్రతి ప్రేమ జంటలు ఉంటుందెమో అనుకున్నాను ” అని కియారా వివరించారు. ఈ కార్యక్రమంలో కియారా, మల్హోత్రా ఒకరినొకరు హత్తుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కియారా, సిద్ధార్థ్ మ్యారేజ్ చేసుకొని బయట చాలా అఫేక్షన్ కూడా చూపిస్తూ మ్యారేజ్ గోల్స్ పెంచుతున్నారు. ఈ స్టార్ కపుల్ ఇంకా భవిష్యత్తులో ఎన్ని గోల్స్ పెంచుతారో చూడాలి.