గణితంలో జాన్వీ కపూర్ లెక్క తప్పిందట… అర్ధంకాకపోతే అంతేమరి అంటున్న నెటిజన్లు!

జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ తొలిచిత్రంతోనే బి టౌన్లో గుర్తింపు సంపాదించుకుంది. హిందీ పరిశ్రమలో శ్రీదేవి వారసురాలిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకునే దిశగా అడుగుల వేస్తోంది. తండ్రి బోనీకపూర్ సూచనలు.. సలహాలు ఆమెకి మంచి పాఠవాలుగా పనిచేస్తున్నాయి. తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యలకు ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

విషయంలోకి వెళితే, జాన్వీకి స్కూల్ డేస్ లో కేవలం హిస్టరీ సబ్జెక్ట్ అంటేనే మక్కువ ఉండేదట. గణితం అయితే అస్సలు నచ్చేది కాదట. ఎందుకంటే అది అర్ధం అయ్యేదికాదట. ఈ విషయాన్ని ఉటంకిస్తూ హిస్టరీ, గణితాన్ని ముడిపెట్టి మాట్లాడింది అమ్మడు. దాంతో ట్రోలర్స్ కి దొరికి పోయింది. ఇంతకీ జాన్వీ ఏమందంటే, “కాలిక్యూలేటర్ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం బాగా సులువైపోయింది. అలాంటప్పుడు కష్టపడి ఆల్ జీబ్రా నేర్చుకోవలసిన అవసరం లేదుకదా? అదే చరిత్ర.. సాహిత్యం చదివితే ప్రజలు సంస్కారవంతులు అవుతారు. అంతేగాని లెక్కలు ఏం నేర్పిస్తున్నాయి? అని అందట.

అక్కడితో ఆగకుండా “బేసిక్ లెక్కలు వరకూ ఒకేగాని, డీప్ గణితం చదవలసిన అవసరం ఏముంది? దానివలన నిత్య జీవితంలో ఉపయోగమే లేదు!” అని అంది. దాంతో సోషల్ మీడియాలో ఆమె మాటలపైన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “జాన్వీకపూర్ కి లెక్కలు రావనుకుంటా? అందుకే ఇలాంటి లేనిపోని లాజిక్ లు మాట్లాడుతోంది అని ఒకరంటే, “కాలిక్యూలేటర్ ద్వారా ఆల్ జీబ్రా చేసేందుకు జాన్వీ ప్రయత్నిస్తుందా?” అని మరొకరు, “మీకు లెక్కలు రాకపోతే గణితాన్ని ఎందుకు నిందిస్తారు?” అని వేరొకరు… ఇలా రకరకాలుగా జాన్వీని ఆడేసుకుంటున్నారు.
.