రాధే శ్యామ్ పబ్లిక్ టాక్: సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..దారుణం భయ్యా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన రెబల్ అభిమానుల నోట ఒక్కే మాటే వినిపిస్తుంది. జై ప్రభాస్..అంటూ కేకలు.. డార్లింగ్ నువ్వు కేక అంటూ అరుపులు..ధియేటర్ ముందు ఆ తీన్ మార్ స్టెప్పులు..అబ్బో అవి మాటల్లో చెప్పలేనిది. ధియేటర్ నుండి సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి అభిమాని చెప్పే మాట ఒక్కటే..ఈ సినిమాలో మనం మరో కొత్త ప్రభాస్ ని చూస్తాం. ప్రభాస్ నటన కేక..పూజా తో రొమాన్స్ సూపర్..సాంగ్స్ టూ గుడ్..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తుంది..అంటూ ఓ రేంజ్ లో రివ్యూ ఇస్తున్నారు. రాధే శ్యామ్ పై పబ్లిక్ టాక్ వింటుంటే..గత ఐదు సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ తన అభిమానుల ఆకలి తీర్చేశాడు అనే అనుకుంటాం. కానీ..

అక్కడ సీన్ మరోలా ఉంది రా సామీ అంటూ కొందరు అసలు విషయాని ఓపెన్ అయిపోతున్నారు. డైనమిక్ డైరెక్టర్ రాధా కృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ హీరో గా తెరకెక్కిన చిత్రమే ” రాధే శ్యామ్”. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా లో అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ స్టోరీ అంటూ కధ కొంత కాలంగా టీం చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ ఆ స్టోరీని మనకు చూపించడం లో ఫెయిల్ అయ్యాడు రాధా అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. సినిమా లుక్స్ పరంగా బాగానే ఉన్నా..ఎక్స్ పెక్ట్ చేసినంత అయితే లేదు అంటూ రివ్యూ ఇస్తున్నారు. ముఖ్యంగా మన ప్రభాస్ కి తగ్గ రేంజ్ సినిమ అయితే కాదంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పేస్తున్నారు. ఎవ్వరు ఊహించని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్న అంటూ చెప్పిన డార్లింగ్ ప్రభాస్ కు ఈ సినిమా ఆశించినంత పేరుని తీసుకురాకపోవచ్చు అంటూ అభిప్రాయపడుతున్నారు.

అనుకోకుండా ట్రైన్ లో కలిసిన పూజా (ప్రేరణ) తో లవ్ లో పడినా విక్రమాదిత్య(ప్రభాస్) హస్త రేఖ నిపుణుడు కావడంతో తనకు అన్ని ముందే తెలిసిపోతుంటాయి. మనకు సినిమా చూయించే స్టార్టింగ్ లో కూడా ప్రభాస్ ను అలానే చూయిస్తారు. ఇండియాలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించబోతుందని ముందే తెలుసుకున్న విక్రమాదిత్య..ఇండియా నుండి ఫారిన్ కి వెళ్లిపోతాడు. ఇక అక్కడే స్టోరీ మొదలవుతుంది.కానీ మన డార్లింగ్ కి ప్రేమ పుట్టి చాలా ఏళ్ళు అవుతుంది. అదే అసలైన కధ . కానీ ఫస్ట్ టైం పూజాని చూడగానే అట్రాక్ట్ అవుతాడు. ట్రైన్ లో వీళ్ల మధ్య వచ్చే సంభాషణ యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ లో పెట్టే ట్వీస్ట్ సినిమాకే హైలెట్ కానీ అర్ధంకాదట..ఇక క్లైమెక్స్ లోనే సినిమా ప్రాణం దాగి ఉంది అంటూ కొందరు అంటుంటే.. రాధ కృష్ణ ఇంకొంచెం బాగా తెరకెక్కించి ఉండచ్చు సినిమా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే రాధే శ్యామ్ సినిమా ఓకే ఓకే..అంత తీసిపడేయ్యక్కర్లేదు..అలా అని చరిత్రలు తిరగరాసే సీన్ లేదు అంటూ ఒక్క మాటలో చెప్పేస్తున్నారు. ఈ సినిమా లవర్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అది కూడా వాళ్ళు కనెక్ట్ అయితేనే. దీంతో అప్పుడే నెట్టింట మీమ్‌స్ స్టార్ట్ అయిపోయాయి. బాలకృష్ణ డైలాగ్ ని వాడుకుంటూ సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అంటూ రాధే శ్యామ్ మూవీ పై దారుణం గా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. అయితే ప్రభాస్ అభిమానులు ఈ సినిమాని కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించినా..టాక్ పరంగా మాత్రం యావరేజ్ అనే అంటున్నారు సినీ విశ్లేషకులు.