నాలుగో రోజు భీమ్లాకు భారీ షాక్‌.. భారీగా డ్రాఫ్ అయిన క‌లెక్ష‌న్లు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “భీమ్లా నాయక్”. గత శుక్ర‌వారం రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ తొలి రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఏపీలో అయితే ప్ర‌భుత్వం టిక్కెట్ రేట్లు త‌గ్గించేసింద‌ని.. అద‌న‌పు షోలు లేవ‌ని.. ప్ర‌భుత్వ యంత్రాంగం అంతా భీమ్లానాయ‌క్ సినిమాను టార్గెట్ చేసింద‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం జ‌రిగింది.

ప‌వ‌న్ అభిమానుల ఆరోప‌ణ‌లు ఓ వైపు, అటు వైసీపీ వాళ్లు, ఏపీ మంత్రుల కౌంట‌ర్లు మ‌రోవైపు ఇలా ప్ర‌చారం న‌డిచింది. ఇక ఏపీలో ఎంత ప్ర‌చారం జ‌రిగినా భీమ్లానాయ‌క్ ఒక్క ఉత్త‌రాంధ్ర మిన‌హా అన్ని ఏరియాల్లోనూ మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక నైజాంలో టిక్కెట్లు రేట్లు పెంచేసుకున్నారు. అన్నీ థియేట‌ర్లు వేసుకున్నారు. పైగా రెండు వారాల పాటు ఐదు షోల‌కు అనుమ‌తులు ఉన్నాయి.

నైజాంలో తొలి మూడు రోజుల్లోనే రు. 25 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టేసింది. అయితే అనూహ్యంగా నాలుగో రోజు వ‌సూళ్లు డ్రాప్ అయిపోయాయి. ఈ చిత్రం నాల్గవరోజు కి గాను 1.9 కోట్ల షేర్ ని అందుకుందట. మరి మిగతా రోజులతో పోలిస్తే ఇది బాగా డ్రాప్. ఇంకా రు. 15 కోట్ల‌కు పైగా షేర్ వ‌స్తే కాని ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ కు రాదు. అక్క‌డ దిల్ రాజు ఈ సినిమాను పంపిణీ చేశారు. మ‌రి లాంగ్ ర‌న్‌లో ఎంత వ‌ర‌కు సేవ్ చేస్తుందో చూడాలి.