ధూళిపాళ్ల న‌రేంద్ర గెలుపుకు అడ్డు ఎవ‌రు..!

గుంటూరు జిల్లా పొన్నూరును ధూళిపాళ్ల ఫ్యామిలీ త‌న అడ్డాగా చేసుకుంది. పొన్నూరు నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తోన్న న‌రేంద్ర‌కు చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి మాత్రం ఇవ్వ‌లేదు. 1994 – 1999-2004-2009-2014ల‌లో వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచిన న‌రేంద్ర వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే న‌రేంద్ర ఆరోసారి విజ‌యానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేకులు వేస్తుందా ? అన్న చ‌ర్చ‌లు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గ‌తంలో వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచిన సీనియ‌ర్లు ఆరో టైంలో మాత్రం ఓడిపోయారు.

జిల్లాలో వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన మాకినేని పెద‌ర‌త్త‌య్య (ప్ర‌త్తిపాడు), కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు (న‌ర‌సారావుపేట‌), క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ (పెద‌కూర‌పాడు, గుంటూరు వెస్ట్‌)లు వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచినా ఆరో ప్ర‌య‌త్నంలో మాత్రం ఓడిపోయారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఇదే బ్యాడ్ సెంటిమెంట్‌లో న‌రేంద్ర చిక్కుకుంటాడా ? లేదా దీన్ని చిత్తుచేసి గెలుస్తాడా ? అన్న‌దానిపై గుంటూరు జిల్లాలో జోరుగా రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పొన్నూరులో న‌రేంద్ర‌కు ఇప్పుడిప్పుడే వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఒక‌వేళ పొన్నూరు ఎస్సీ అయితే ప‌క్క‌నే ఉన్న ప్ర‌త్తిపాడు నుంచి న‌రేంద్ర పోటీ చేస్తాడ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి ఈ బ్యాడ్ సెంటిమెంట్ న‌రేంద్ర విష‌యంలో ఎలా వ‌ర్తిస్తుందో చూడాలి.