టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్షనఖలె రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి తో చేయబోతున్నాడు అంటూ టాక్ గత కొంత కాలంగా తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
అయితే.. ఈ విషయంలో ఫ్యాన్స్ కు కొద్దిగా షాక్ గా అనిపించినా.. ఇది మరో క్రేజీ అప్డేట్ కూడా. సురేందర్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ తో కాకుండా.. మరో హీరోతో తన సినిమాను సెట్ చేసుకున్నాడట. ప్రస్తుతం ఆయన అ హీరో కోసం స్టోరీ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ. ఆయనతో సురేందర్ రెడ్డి గారు సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక.. ఈ సినిమాకు వక్కాంతం వంశీ కథ అందించినట్లు సమాచారం.
ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి రవితేజ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్లు.. మరికొన్ని రోజుల్లో దానిని రవితేజకు వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఇవన్ని ఒక ఎత్తయితే.. రవితేజ, సురేందర్ రెడ్డి, వక్కంతాం కాంబోలో గతంలో వీళ్ళ ముగ్గురి కాంబోలో కిక్, కిక్ 2 సినిమాలు అందుకోలేకపోయింది. అయితే.. ఇప్పుడు మరోసారి ముచ్చటగా మూడో సినిమా ప్రారంభం కాబోతుందని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇదే వాస్తవం అయితే కచ్చితంగా సినిమాపై ఆడియన్స్‌లో మంచి బజ్ నెలకొంటుంది.

