మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా.. ఎన్టీఆర్ మరో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. సినిమా ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సత్తా చాటాలన్నీ కాసితో ఉన్నాడు తారక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. తారక్ ఫ్యూచర్ లైనప్ కూడా.. చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టుకున్నాడు.
కాగా.. గతంలో ఎన్టీఆర్ చాలా ఇండస్ట్రియల్ హిట్ సినిమాలను వదులుకున్నాడంటూ టాక్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి.. పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో తమ వద్దకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని డిజాస్టర్లు గా మారితే.. కొన్ని బ్లాక్ బస్టర్లు గా మారి.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే తారక్ రిజెక్ట్ చేసిన కథలు కొన్ని బ్లాక్ బస్టర్లుగా నిలిచాయనే టాక్ వైరల్‌గా మారుతుంది. అలా.. గతంలో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఇండస్ట్రియల్ హిట్ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. లిస్ట్‌లో మొదటిది రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన కిక్. ఈ సినిమా ఎంత మంచి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్య సినిమా సైతం మొదట ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందట.
అయితే.. ఎన్టీఆర్ కథను రిజెక్ట్ చేయడంతో బన్నీ హిట్ కొట్టాడు. ఇక వివి వినాయక్ డైరెక్షన్లో నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్, బోయపాటి డైరెక్షన్లో రవితేజ హీరోగా వచ్చిన భద్ సినిమాలు సైతం ఎన్టీఆర్ వద్దకు వెళ్లాయట. నాగార్జున హీరోగా కార్తీక్ మరో కీలక పాత్రలో మెరిసిన మూవీ ఊపిరి సినిమా సైతం.. కార్తి రోల్ కోసం ఎన్టీఆర్‌ను అప్రోచ్ అయ్యరట. అయితే.. ఆయన ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు. కళ్యాణ్ రామ్ నటించిన అతను ఒక్కడే, రామ్ చరణ్, బన్నీ కాంబోలో వచ్చిన ఎవడు, రవితేజ – కృష్ణ సినిమాలు సైతం మొదట ఎన్టీఆర్ వద్దకే వెళ్లాయని.. సినిమాలన్నీ ఏవో కారణాలతో ఎన్టీఆర్ వదులుకోవడంతో.. మిగతా హీరోస్ నటించి బ్లాక్ బస్టర్లు కొట్టారని టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇక కెరీర్ ప్రారంభం నుంచే ఈ సినిమాలన్నింటిలోనూ ఎన్టీఆర్ నటించి ఉంటే ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయేదని.. అనవసరంగా ఈ సినిమాలను మిస్ చేసుకున్నాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

