టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఆర్య లాంటి సినిమాతో తన జర్నీని ప్రారంభించి పుష్పా లాంటి సాలిడ్ సక్సెస్‌తో టాలీవుడ్ సరిహద్దులను బద్దలు కొట్టి ఇంటర్నేషనల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ లెక్కల మాస్టారు పుష్పా లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ముందు రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు. సుకుమార్ కు ఈ సినిమా మైల్డ్ స్టోన్ గా నిలిచిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. అయితే.. సుకుమార్ ఇలాంటి బ్లాక్ బస్టర్ కథను ఫస్ట్ చరణ్‌కు కాకుండా మరొకరికి వివరించాడట.
ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు. రంగస్థలం స్టోరీని ఫస్ట్ టైం నేను అర్జున్ వై.కే కి వివరించానని.. ఒక రోజు నైట్ రంగస్థలం సినిమాకు సంబంధించిన కథ ఐడియా నాకు వచ్చింది. ఒక 18, 20 నిమిషాల క్లైమాక్స్ కథ ఐడియా వస్తే.. అర్జున్.వై.కే ని పిలిచి తనకే ఈ స్టోరీ చెప్పా అంటూ వివరించాడు. ఆ టైంలో.. ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుందని ఆయన గుర్తు చేసుకున్నాడు. అర్జున్ కు కథ చెప్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడని.. తర్వాత ఫోన్ చేసి బాగుందని చెప్పాడంటూ వివరించాడు.
అయితే.. అసలు సంగతి తర్వాత తెలిసిందని.. సుకుమార్ కామెంట్ చేశారు. అర్జున్ కు కథ చెప్పిన టైంలో తను ఆ కథ ను ఊహించుకున్నాడట. అందుకే.. అభిప్రాయం చెప్పలేక వెళ్ళిపోయాడట. కానీ.. తర్వాత తను ఫోన్ చేసి కథ బాగుందని అన్నాడని వివరించాడు. ఇంతకీ.. ఈ అర్జున్ వై.కె ఎవరు అనుకుంటున్నారా.. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తి. ప్రసన్నవాదనం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రిజల్ట్ అందుకుంది. జగడం నుంచి సుకుమార్ తెరకెక్కించిన అన్ని సినిమాలకు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. ఇక.. ప్రస్తుతం సుకుమార్ మరోసారి రామ్ చరణ్ తో సినిమాని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. ఈ సినిమా రైటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యిందట.

