” వారణాసి ” జక్కన్న మాస్టర్ ప్లాన్ లీక్.. మహేష్ ఏకంగా అన్ని గెటప్స్ లో కనిపిస్తాడా..!

ప్రస్తుతం ఇండియ‌న్‌ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందుతున్న మూవీ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. రికార్డ్ లెవెల్ బడ్జెట్ తో గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ జక్కన్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా గ్లోబల్ ట్రోట‌ర్‌ ఈవెంట్‌ను నిర్వహించి సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ గ్లింప్స్‌లో మహేష్ బాబు పాత్ర గురించి రాజమౌళి ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ లీక్ చేశాడు. ఈ సినిమాలో మహేష్ రుద్ర పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారానే లీక్ చేసిన జక్కన్న.. రుద్ర, శ్రీరాముడి పాత్రల ఛాయలు కలిగిన ఓ శక్తివంతమైన పాత్రగా మెరవనున్నాడని వెల్లడించాడు.

Rajamouli Thanks Mahesh Babu Fans for Their Unwavering Support at Varanasi  Event - TeluguBulletin.com

ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. ఇలాంటి క్రమంలో.. సినిమాకు సంబంధించిన ఓ టాక్‌ మరింత వైరల్ గా మారుతుంది. రాజమౌళి విజన్ ప్రకారం వారణాసిలో మహేష్ బాబు ఏకంగా 5 వైవిధ్యమైన గెటప్స్ లో కనిపించనున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే.. బయటకు రుద్రా, శ్రీరాముడి లుక్స్ గురించి రివీల్ చేశాడు జక్కన్న. ఇక.. సినిమా కోసం జక్కన్న వేసిన మాస్టర్ ప్లాన్ మహేష్ బాబు అభిమానులు ఇప్పటివరకు చూడని రీతిలో ఒక విజువల్ వండర్‌ని సరికొత్త యాక్షన్ ఫ్యాక్ట్ అవతారాల్లో తెరపై చూపించనున్నాడట. అయితే.. వీటి పై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా ఈ మూడు పాత్రలు మరింత పేపర్ ఫుల్ గా కనిపించనున్నాయని తెలుస్తుంది.

SSMB29 is officially Varanasi! SS Rajamouli unveils Mahesh Babu's...

రాజమౌళి తన సినిమాల్లో హీరోల పాత్రను ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడో తెలిసిందే. ఇప్పటికే బాహుబలిలో ప్రభాస్ లుక్‌ శివుడిగా, ఆర్ఆర్ఆర్ లో.. చరణ్, ఎన్టీఆర్ లను విప్లవ వీరులుగా చూపించాడు. ఇప్పుడు వారణాసిలో మహేష్ ని ఏకంగా 5 అవతారాలతో చూపించనున్నాడట. దీన్నిబట్టి సినిమాలో రోల్, ఇంపార్టెన్స్, స్టోరీ లో డెప్త్ ఎంత గొప్పగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రోల్‌ మాత్రమే కాదు కథనంలో వచ్చే కాలాలకు సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చూపించబోతున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఇదే.. నిజమైతే మాత్రం మహేష్ అభిమానులకు పెద్ద పండగగా మారుతుంది అనడంలో సందేహం లేదు.