నందమూరి నటసింహం బాలకృష్ణా పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ లో ఒక సరికొత్త వైబ్రేషన్ మొదలైపోతుంది. ఆయన యాక్షన్‌కు లాజిక్ లేకపోయినా.. థియేటర్‌లలో విజిల్స్ పడిపోతాయి. స్టెప్స్ వేస్తే చాలు స్క్రీన్ దద్దరిల్లిపోతుంది. ఈ క్రమంలోనే.. బాలయ్య సైతం ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను మరింత సర్ప్రైజ్ చేసేలా నటవిశ్వరూపాని చూపిస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం మరోసారి ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేశాడట బాలయ్య.
తన 111వ సినిమాలో బాలయ్య కేవలం నటన కాదు.. తనలోని మరో కొత్త అవతారని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. బాబి కొల్లి డైరెక్షన్లో రూపొందనున్న ఈ సినిమా కోసం మరోసారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడట. బాలకృష్ణకు పాటలు పాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పైసా వసూల్ మూవీలో మామ ఏక్ పెగ్ లా సాంగ్ తనదైన స్టైల్ లో పాడి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్పుడు.. ఎన్బికె 111 కోసం మరొకసారి ఆ కొత్త అవతారాన్ని మరింత హై వోల్టేజ్ మాస్ సాంగ్ తో చూపించడానికి సిద్ధమవుతున్నాడట.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా.. బాలయ్య గొంతుకు తగ్గట్టు అదిరిపోయే ట్యూన్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల.. ఈ సాంగ్‌కు సంబంధించిన రికార్డింగ్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయట. ఇక.. ఈ విషయాన్ని మేకర్స్ సీక్రెట్‌గా మైంటైన్ చేయాలని ప్రయత్నించినా.. సోషల్ మీడియాలో రివిల్ అయిపోయింది. ఇప్పుడు.. బాలయ్య సాంగ్ పడడం సినిమాకు మరింత హైలెట్గా మారింది. అంతేకాదు.. ఈ సాంగ్‌లో ఆయన ఎలివేషన్ సీన్స్.. ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయని.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ ఖాయం అంటూ తెలుస్తుంది.

