తెలుగు బిగ్ బాస్ 9 నేటితో ముగిసిపోతుంది. ఈ క్రమంలోనే దాదాపు రెండు, మూడు వారాల నుంచి ఉత్కంఠ రేపుతున్న అంశం టైటిల్ రేస్‌లో విన్నర్ ఎవరు.. మరి కొద్ది సేపట్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. రికార్డ్ లెవెల్ లో ప్రస్తుతం బిగ్ బాస్ కు టిఆర్పి రేటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా మొదలైపోయి దాదాపు ఎలిమినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయని సమాచారం.

కేవలం టాప్ 2 మాత్రమే హౌస్ లో మిగిలి ఉన్నారట. వాళ్ళని స్టేజ్ పైకి తీసుకువచ్చే ఎపిసోడ్ మాత్రం ఈరోజు సాయంత్రం కొనసాగుతుంది. అంటే.. విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే.. ఫైనల్ ఎపిసోడ్ టెలివిజన్‌లో చూడాల్సిందే. ఇక ఈ సీజన్ స్పెషల్ గెస్ట్ గా ప్రభాస్ రాబోతున్నాడు అంటూ మొదట వార్తలు వినిపించినా.. ఇప్పుడు చిరంజీవి ఫిక్స్ అయ్యాడని సమాచారం. కాగా.. శుక్రవారం రాత్రి 12 గంటలకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయిన సంగతి తెలిసిందే.

ఆ ఓటింగ్ లిస్ట్ ప్రకారం విన్నర్ రేస్ లో తనుజ, కళ్యాణ్ ఉండగా.. వీళ్ళిద్దరిలో అసలైన విన్నర్ ఎవరో మాత్రం చెప్పడం కష్టమేనని సమాచారం. ఇక.. ఇంటి నుంచి టాప్ 5లో మొదట సంజనాగల్రాని బయటకు వచ్చేయగా.. టాప్ 4లో ఇమ్మానుయేల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక టాప్ 3లో డిమొన్ పవన్ నిలిచినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. ఫైనల్ ట్రోఫీ ఎవరు అందుకోబోతున్నారో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాలి.

