అఖిల్ ” లెనిన్ ” పై అదుర్స్ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే

అక్కినేని న‌టవారసుడిగా.. నాగార్జున చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్. అయితే మొదటి సినిమాతో ఆడియన్స్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేసినా.. ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే.. పలు సినిమాలతో సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే.. ఇప్పటివరకు అఖిల్ కెరీర్‌లో ఒక్కసరైనా హిట్ కూడా లేకపోయినా.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ప్రస్తుతం అఖిల్ లెనిన్‌ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

AKHIL AKKINENI'S NEXT FILM TITLED 'LENIN' – TITLE GLIMPSE UNVEILS... On  #AkhilAkkineni's birthday today, here's an exciting update – the  announcement of his new film, titled #Lenin... The title glimpse is out

ఈ సినిమాకు డైరెక్టర్గా మురళి కిషోర్ అబ్బూరి వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. అదే సినిమాలో ఇప్పటికే అఖిల్ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నాడట. అయితే.. ప్యాచ్ వర్క్ ల కోసం మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే నెలలో ప్యాచ్ వర్క్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక.. ఈ సినిమాను చిత్తూరు ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Akhil-Bhagyashri Borse starrer Lenin aiming for February 2026 release:  reports

ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెరవనుంది. అఖిల్ – భాగ్యశ్రీ కాంబోలో వచ్చే లవ్ సీన్స్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. సినిమాపై అఖిల్ కూడా భారీ హోప్స్ పెట్టుకున్నాడట. సినిమా అవుట్ ఫుట్ అయితే అదిరిపోయిందని.. కచ్చితంగా సినిమా హిట్ కొడుతుందని టీం స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆడియన్స్‌లోనూ సినిమాపై హైప్‌ నెలకొంటుంది. ప్రస్తుతం సరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో.. రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.