టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మనసంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవల్ అంచనాలను నెలకొన్నాయి. ఇక తాజాగా.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.

అదే మూవీ రన్ టైం. టాలీవుడ్ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 2 గంటల 35 నిమిషాలు గా లాక్ చేశారట. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఇప్పటివరకు జరిగే అన్ని సినిమాలు చాలా స్పీడ్ స్క్రీన్ ప్లే తో.. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేలా చూపిస్తుంటాడు. అయితే.. ఈ సినిమాకు మాత్రం ఏకంగా 158 నిమిషాల రన్ టైం ఉండడం చూస్తుంటే.. ఆడియన్స్‌లో సినిమా ఎలా ఉండబోతుందని అంచనాలు మొదలయ్యాయి. ఇక సినిమా స్టార్టింగ్‌లోనే అనిల్ రావిపూడి.. వింటేజ్ చిరును చూపించబోతున్నానని క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే సినిమాలో ఎమోషన్స్.. అలాగే ఫ్యామిలీ డ్రామాకు కూడా పెద్ద పీట వేశారట. అన్ని ఎమోషన్స్ ఈక్వల్‌గా చూపించబోతున్నాడని సమాచారం.
రన్ టైం కాస్త ఎక్కువ అయినా.. అనీల్ సినిమాలో కంటెంట్ బలంగా ఉంటుంది గనుక. ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఈ సినిమా హిట్ కొడుతుందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ తో పాటు మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్న క్రమంలో సినిమాకు మరింత ప్లస్ అయింది. దానికి తగ్గట్లుగానే ఇద్దరు హీరోలు కలిసి స్టెప్స్ కూడా వేయనున్నారట. ఈ క్రమంలోనే సినిమా కోసం అటు మెగా అభిమానులతో పాటు.. ఇటు దగ్గుబాటి అభిమానులు సైతం ఈగరగా వెయిట్ చేస్తున్నారు. ఇక జనవరి 12న గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కోసం సిద్ధమవుతున్నాయి. సినిమా ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

