టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓద్దెల కలిసి మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత నానితో తీ ప్యారడైజ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకోవచ్చాడు శ్రీకాంత్. ఈ సినిమా కూడా ఎస్ఎల్బీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నాని.. ది పారడైజ్ లో జడల్ అనే డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే నాని లుక్స్ తో పాటు రిలీజ్ అయిన గ్లింప్స్ సైతం ఆడియన్స్ లో నాని క్యారెక్టర్జేషన్ పై ఆసక్తిని పెంచేశాయి. అంతేకాదు సినిమాలో విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెరవనున్నారు. మోహన్ బాబు విలనిజం ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటివరకు చాలా సినిమాల్లోనే చూసాం.

అయితే.. ఆఫ్టర్ లాంగ్ టైం మోహన్ బాబు మళ్లీ విలన్ గా వెండి తెరపై అదరగొట్టనున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక మార్చ్ 26న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో దాదాపు సినిమాకు సంబంధించిన కాస్టింగ్ వివరాలన్నీ బయటకు వచ్చేసాయి. కానీ.. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై మాత్రమే సీక్రెట్ మైంటైన్ చేస్తూ వచ్చారు. హీరోయిన్ ని ఎందుకు దాస్తున్నారని డిస్కషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం నాని.. ది పారడైజ్ సెట్ లోకి హీరోయిన్ అడుగుపెట్టిందట.

ఈ సినిమాలో అసలు ఊహించని ఓ క్రేజీ హీరోయిన్ నటించబోతుందని.. శ్రీకాంత్ ఓద్దెల సెలక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ అట.ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేకుండానే కయాదు లోహర్.. ది పారడైజ్ సెట్‌లో ఎంట్రీ ఇచ్చిందట. డ్రాగన్ మూవీ సక్సస్‌తో కయదు టాలీవుడ్‌లోను మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే విస్వక్ సేన్‌తో ఫంకీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కూడా సైలెంట్ గా షూట్ లో జరుపుకుంటున్న సంగతి తెలిసింది. ఇక ఇప్పుడు ది పారడైజ్ లోను సీక్రెట్ గా అమ్మడు తన పార్ట్ కంప్లీట్ చేస్తుందంటూ టాక్ వైరల్ అవుతుంది. నాని, కయాద్ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. ఇక సినిమాను పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

