తారక్ ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. దేవర 2 సెట్స్ పైకి వచ్చేది అప్పుడే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా దేవర పార్ట్ 1 ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమా రికార్డ్‌ లెవెల్‌లో కలెక్షన్లు కల్లగొట్టింది. ప్రస్తుతం దేవ‌ర‌ పార్ట్ 1 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

ఇక ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో ఆయన డ్రాగన్ సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు కొరటాల శివ దేవర 2 కోసం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా గ‌డుపుతున్నట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్ హీట్ అయిన క్రమంలో.. సెకండ్ పార్ట్ అంతకుమించి పోయే రేంజ్‌లో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా కొరటాలా స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడట.

Devara Part 1 Movie Review Jr NTR Saif Ali Khan Janhvi Kapoor Prakash Raj  Breathe Life Into Koratala Siva Film

అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. దేవర 2 వచ్చేయడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ‌ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక జాన్వి కపురి సినిమాలో హీరోయిన్ అని తెలిసిందే. సైఫ్ అలిఖాన్, చైత్రరాయ్, షైన్ టామ్ చౌక్‌, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌.. తదితరులు కీలకపాత్రలో మెర‌వ‌నుండగా.. అనిరుధ్‌ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు.