టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాల విషయంలో జోరు పెంచిన సంగతి తెలిసిందే. నిన్నమొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులను నిర్వర్తిస్తూ మొదటి పది నెలలు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన పవన్.. తన లిస్ట్‌లో ఉన్న మూడు సినిమాల షూటింగ్‌రు పక్కన పెట్టేసినా.. ఇప్పుడు పాలిటిక్స్‌కు కాస్త గ్యాప్ తీసుకుని వరుసగా వీరమల్లు, ఓజి షూట్లను పూర్తి చేశాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూట్లో ఫుల్ బిజీబిజీగా రానిస్తున్నాడు. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు సెట్స్‌లో సందడి చేస్తున్నాడట. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది.
ఈ నెలాఖరులోనే ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ రోల్‌కు సంబంధించిన షూట్ మొత్తాన్ని ఒకసారి పూర్తి చేసేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు.. సినిమా రిలీజ్‌కు.. ఇప్పటికే మూడు తేదీలు ఫిక్స్ చేశారని అంటున్నారు. అందులో ఒకటి డిసెంబర్.. క్రిస్మస్ రోజున సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలు టీమ్ ఉన్నారట. క్రిస్మస్‌కు ఇప్పటికే అవతార్ సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కాగా తాజాగా ఆ సినిమా పోస్ట్ పని అయిందరి తెలుస్తుతంది. ఒకవేళ అదే జరిగితే భగత్ సింగ్ క్రిస్మస్ కి వచ్చేస్తుందని. క్రిస్మస్‌కి రాకపోతే సంక్రాంతికి రిలీజ్ చేస్తారంటూ టాక్ నడుస్తుంది. కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతిలోనే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ కూడా రిలీజ్ అవుతున్న క్రమంలో.. అన్నదమ్ముల మధ్య పోటీ సరికాదని.. ఒక్కసారి చిరంజీవితో రిలీజ్ పై చర్చలు జరిపి సంక్రాంతికి విడుదల చేయాలా.. వద్దా అని నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఒకవేళ చిరు ఒప్పుకోకపోతే జనవరి 26న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ సినిమాలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఏడాది నుంచి ఎనిమిది నెలల్లో మూడు పవన్ కళ్యాణ్ సినిమాలు అభిమానుల ముందుకు వచ్చినట్టు అవుతుంది. పవన్ ఫ్యాన్స్‌కు ఇది త్రిబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు. ఇక.. హరిహర వీరమల్లు ఈనెల 24న గ్రాండ్గా లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు.. సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ కానుంది. రెండు సినిమాల తర్వాత కొద్ది నెలల గ్యాప్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రీన్ పై సందడి చేస్తుందని సమాచారం.