50 మిలియన్ న్యూస్ తో దూసుకుపోతున్న ” కుర్చీ మడతపెట్టి ” సాంగ్.. సినిమా హిట్ అవ్వకపోయినా సాంగ్ బానే లాగుతుందిగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మించిన ఈ మూవీ ఈనెల సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న రిలీజై మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంతటి దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 50 మిలియన్ కి పైగా వ్యుస్‌ అందుకుని మరింత దూసుకుపోతుంది.

థమన్ మంచి మాస్ బీట్ అందించిన ఈ సాంగ్ ని సాహితీ చాగంటి, శ్రీ కృష్ణ అద్భుతంగా ఆలపించగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు శ్రీ లీల మాస్ డాన్స్ తో కుమ్మేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా కనుక ఏమాత్రం క్లిక్ అయినా సూపర్ హిట్ ఖాతాలో పడుతుంది.