” భగవంత్ కేసరి ” వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ అండ్ టైం ఫిక్స్..!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల ముఖ్య పాత్రలో పోషించిన మూవీ ” భగవంత్ కేసరి “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హీట్ ని దక్కించుకుంది.

ఇక గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో మరో మాస్ హిట్గా నిలవడంతో బాలయ్య నెక్స్ట్ మూవీపై భారీ హైప్స్ నెలకొన్నాయి. ఇక ఈ మూవీ బిగ్ స్క్రీన్ తర్వాత ఓటీటీ లో కూడా వచ్చిన తర్వాత అదిరే రెస్పాన్స్ ని అందుకోగా ఇప్పుడు ఫైనల్ గా స్మాల్ స్క్రీన్ పై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమయింది.

ఈ మూవీ సాటిలైట్ హక్కులు జీ తెలుగు సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ జనవరి 28న సాయంత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా 5 గంటల 30 నిమిషాలకి ప్రసారం కానుంది. ఇక ఈ వార్తని జీ తెలుగు తమ ట్విట్టర్ ఎకౌంటు వేదికగా తెలియజేశారు. ఇక ప్రస్తుతం వీరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.