“దేవర” కోసం జాన్వీ ఎంత పుచ్చుకుంటుందో తెలుసా..? కెరీర్ లోనే హైయెస్ట్ ..!!

కోట్లాదిమంది సినీ లవర్స్ ఎంతో ఇష్టంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు .

రీసెంట్గా దేవర సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దేవర సినిమా ద్వారా తెలుగులోకి డెబ్యూ ఇవ్వబోతున్న జాన్వి కపూర్ ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఆమె కెరియర్ లోనే ఇది హైయెస్ట్ కావడం గమనార్హం . ఈ సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తుందట జాన్వి కపూర్ .

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఆమె కెరియర్ లో ఇదే హైయెస్ట్ కావడం గమనార్హం. ఈ సినిమాలో అచ్చం పల్లెటూరి గెటప్ లో కనిపించబోతుంది జాన్వీ. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆ రోల్ కోసం సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట మేకర్స్..!!