ఆ ఏరియాలో ” కేజిఎఫ్ చాప్టర్ 1, కాంతారా ” మూవీలని తలదన్నిన ” హనుమాన్ “.. నువ్వు సూపర్ రా తేజ..!

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమా గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది హనుమాన్. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని నిరంజన్ రెడ్డి నిర్మించారు.

ఇక‌ వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక తాజాగా హనుమాన్ మూవీ హిందీ వర్షన్ లో కూడా భారీ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే అక్కడ రూ. 21 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ సమయానికి రూ. 23 కోట్లకు చేరుకునే అవకాశం కనబడుతుంది.

kgf2
kgf2

కాగా ఇది గతంలో రిలీజ్ అయిన భారీ పాన్ ఇండియా సినిమాలు కేజిఎఫ్ 1, కాంతారా ఫస్ట్ వీక్ హిందీ కలెక్షన్స్ ను క్రాస్ చేసి దూసుకుపోతుంది. ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని సినిమాలని క్రాస్ చేస్తుందో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.