సోలో రిలీజ్ పై ‘ ఈగిల్ ‘ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ..

మాస్ మహారాజు రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టం లేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఈగిల్. స్టార్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్‌ర్లు ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా నిజానికి జనవరి 13న‌ సంక్రాంతి బ‌రిలో ప్రేక్షకులు ముందుకు రావలసింది.. కానీ ఆఖరి నిమిషంలో త‌గిల్ టీమ్ వెర‌కు త‌గ్గారు.

ఫిలిం ఛాంబర్ లో జరిగిన మీటింగ్ తో ఈగిల్ కి సోలో రిలీజ్ ఇస్తామని చెప్పడంతో ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మేకర్స్ ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేయడానికి ఓకే చెప్పారు. అయితే ఇదే డేట్ లో ఈ సినిమాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. అదెలా సోలో రిలీజ్ అవుతుంది అనేది తాజాగా నెట్టింట చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. దీనిపై లేటెస్ట్గా ఈగిల్ మూవీ ప్రొడ్యూసర్ తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ సెక్రటరీకి ఓ లెటర్ అందించారు.

తాము అవసరం ఉన్నప్పుడు డేట్ నుంచి ఎలాగైతే తప్పు కొన్నామో.. అదే విధంగా ఆ టైంలో మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం తమకి డేట్ లో సోలో రిలీజ్ ఇచ్చి మాట నిలుపుకోవాలి అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఫిలిం ఛాంబర్ కు తెలియజేశారు. వారు ముందుగా చెప్పినట్లుగానే ఈగిల్ సినిమాకు సోలో రిలీజ్ ఇస్తారో లేదో వేచి చూడాలి.