“ఎవ్వడైతే నాకేంటి రా”… బన్నీ కి భారీ ఝలక్ ఇచ్చిన శ్రీలీల..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ..మన అల్లు అర్జున్ కి బిగ్ షాక్ ఇచ్చిందా ..?అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే.. శ్రీ లీల మల్టీ టాలెంటెడ్ . నటన – పాటలు- డాన్స్ అబ్బో ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ..మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ .

రీసెంట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో ఆమె వేసిన డాన్స్ బాగా హైలైట్ గా మారింది . అయితే ఆమె డాన్స్ చూసిన సుకుమార్ పుష్ప 2 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆమెను చూస్ చేసుకున్నారట . బన్నీ చేత హై రికమండేషన్ తో ఆమెకు కాల్ కూడా చేయించారట. కానీ శ్రీ లీలా మాత్రం ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట . ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను అలా స్పెషల్ సాంగ్ చేయను అంటూ ముఖానే చెప్పేసిందిట .

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. దీనికి కారణం లేకపోనూ లేదు . శ్రీలీలను గుంటూరు కారం తర్వాత చాలామంది కేవలం డాన్స్ కే పనికొస్తుంది అంటూ ట్రోల్ చేశారు. ఆ మాటలకి హర్ట్ అయిన శ్రీలీల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గుంటూరు కారం సినిమాతో శ్రీలీల కి బాగానే బుద్ది వచ్చిన్నట్లు ఉంది అంటున్నారు జనాలు..!!