తెలుగు స్టేట్స్ లో మరీ దారుణంగా మారిన ” సైంధవ్ “.. ఏంటి బాసు ఇది…!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకీ హీరోగా నటించగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు నవజుద్దీన్ సిద్ధికి లాంటి టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో నటించారు.

ఇక వెంకీ మామ కెరీర్లో 75వ మూవీగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 13న రిలీజ్ అయింది. ఇక మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమాకి వసూళ్లు చాలా తక్కువగా రావడం గమనార్హం. ఇక ఇంకా చెప్పాలంటే ఈ మూవీ 10 కోట్ల షేర్ ని కూడా రాబట్టలేదు.

ఇక ఈ షేర్ని దాటే ఛాన్సెస్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా వెంకటేష్ 75వ సినిమా విషయంలో చాలా పొరపాటే పడ్డాడని చెప్పాలి. ప్రాముఖ్యత ఉన్న కథను ఎంచుకోకుండా భారీ దెబ్బతిన్నాడు వెంకటేష్. మరి రానున్న రోజుల్లో ఇతర ఏ సినిమాకైనా సైన్ చేసి సూపర్ హిట్ విజయాన్ని కొడతాడో లేదో చూడాలి మరి.