మెగా ప్రిన్స్ బర్త్ డే స్పెషల్.. మట్క గ్లింప్స్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన మేకర్స్..

మెగా హీరో వరుణ్ తేజ్.. ఇటీవ‌ల సొట్ట బుగ్గ‌ల సుంద‌రి లావణ్య త్రిపాఠితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్ళి త‌ర్వాత‌ వరస ప్రాజెక్టులను ప్రకటిస్తూ సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతున్నాడు వ‌రుణ్‌. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ అంద‌రితో క‌లిసి లావ‌ణ్య బెంగళూరులో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికీ ఈ వేడుకలకు సంబంధించిన మెగా ఫ్యామిలీ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో వరుణ్ కు మెగా ఫ్యామిలీ తోపాటు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి విషెస్ అందుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ మూవీ కరుణ కుమార్ దర్శకత్వంలో.. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతోంది. 1975 లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్‌ చూసిన వారంతా వరుణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.