మీ ఆహారంలో ఈ పదార్థాలు ఉంటే మ‌ధుమేహం మీ ద‌రిదాపుల్లోకి రానేర‌దు..!

ప్రస్తుత కాలంలో మధుమేహంతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వచ్చే వ్యాధి మధుమేహం. దీనిని చక్కటి చిట్కాలతో అదుపులో పెట్టుకోవచ్చు. అదికూడా మీకు అందుబాటులో దొరికేవే, మనం నిత్యం చూసే వాటితోనే సులభంగా మధుమేహాన్ని తరిమి కొట్టొచ్చు. ముఖ్యంగా మనం వంటల్లో నిత్యం ఉపయోగించే సరుకులతో మధుమేహాన్ని దూరం చేయొచ్చని నిపుణులు సైతం చెప్పారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. పసుపు:
పసుపులు ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా మధుమేహాన్ని తరిమికొట్టడంలో బాగా ఉపయోగపడుతుంది.

2. దాల్చిన చెక్క:
డయాబెటిస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది.

3. వెల్లుల్లి:
ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

4. లవంగాలు:
లవంగాలు మధుమేహం ని తరిమి కొట్టడంతో పాటు గాయాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇది రక్తంలోని చక్కర స్థాయిలని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

ఈ నాలుగు చిట్కాలు క్రమం తప్పకుండా మధుమేహం ఉన్నవారే కాకుండా.. అనేక సమస్యలు ఉన్నవారు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవారు ఊరికినే అనలేదు… ఇటువంటి చిట్కాలని చూసే అని ఉంటారు.