ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలిగా వచ్చింది. చాలా ఏళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. నవంబరు 1వ తేదీన ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
వివాహం అనంతరం వచ్చిన ఫస్ట్ దీపావళి పండుగను వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కొత్త పెళ్లి కూతురు లావణ్య తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి ఓ ఫోటోషూట్ చేసింది. అలాగే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ లో వరుణ్‌తేజ్ బ్లాక్ కుర్తా ధరించి స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు.
మరోవైపు లావణ్య త్రిపాఠి రెడ్ కలర్ లెహంగాలో అందంగా మెరిసిపోయింది. అయితే ఇప్పుడు ఈ లెహంగా కాస్ట్ హాట్ టాపిక్ గా మారింది. రా మ్యాంగో బ్రాండ్ కు చెందిన లెహంగాను లావణ్య త్రిపాఠి ధరించింది. చాలా గ్రాండ్ గా ఉన్న ఈ డ్రెస్ ధరెంతో తెలుసా.. అక్షరాల రూ. 1,75,000. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఎప్పటిలాగానే ఆశ్చర్యపోతున్నారు. ఆ మధ్య ఖరీదైన దుస్తులతో మెగా కోడలు తరచూ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు ఇలాగైతే లావణ్య దెబ్బకు వరుణ్ ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.