సౌందర్య – అనుష్క మధ్య ఉన్న పోలికలు ఇవే..‌. ఆ విషయంలో ఇద్దరు సేమ్ టు సేమ్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య మరణించి చాలా కాలం అయినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో మాత్రం బ్రతికే ఉంది. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇక సౌందర్యలో ఉన్న పోలికలు అనుష్కలో ఉన్నాయంటూ.. ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన ప్రేక్షకులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్లు అయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు.

సౌందర్య అసలు పేరు సౌమ్య కాగా అనుష్క అసలు పేరు స్వీటీ. ఈ ఇద్దరి అసలు పేర్లు కూడా ఎస్ అనే అక్షరంతో మొదలు కావడం ఆశ్చర్యం. కోడిరామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ” అమ్మవారు ” సినిమా సౌందర్యకు మంచి పేరు ప్రఖ్యాతలు ఇస్తే… అనుష్కకి సైతం కోడిరామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ” అరుంధతి ” సినిమా మంచి పేరు ప్రఖ్యాతలు ఇచ్చింది. ఇద్ద‌రూ క‌న్న‌డ అమ్మాయిలే.

ఇద్దరి స్టార్ హీరోయిన్లు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కోడిరామకృష్ణ నిలిచారు. అలాగే అక్కినేని నాగార్జున ఫేవరెట్ హీరోయిన్ల లిస్ట్ లో ఇద్దరు హీరోయిన్లు ముందు నెంబర్ లో ఉంటారు. వీరిద్దరూ మూడు కంటే ఎక్కువ భాషల్లో మాట్లాడగలరు. అలాగే కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని రూల్ చేశారు కూడా. వీరిద్దరికీ దగ్గర, దగ్గరగా ఒకే పోలికలు ఉండడంతో… వీరిద్దరూ ఒకటే అంటూ కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.