వామ్మో పవిత్ర లోకేష్ రోజుకు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా.. ఈమె ముందు హీరోయిన్స్ కూడా వేస్ట్…!!

టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో పవిత్ర లోకేష్ ఒకరు. తాజాగా ఈమె రెమ్యూనరేషన్ విషయంలో ఓ వార్త వైరల్ అవుతుంది. కన్నడ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నటించిన పవిత్ర లోకేష్.. ఇక ఆ తర్వాత అక్క, వదిన, తల్లి వంటి క్యారెక్టర్స్ లో నటించింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగుతోపాటు కన్నడ సిని పరిశ్రమలో కూడా రాణిస్తుంది. ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర డేటింగ్ అప్పట్లో సంచలనమే సృష్టించిందని చెప్పాలి.

ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. వీరి పెళ్లికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎన్నో అడ్డంకులు సృష్టించిందని అప్పట్లో వార్తలు వెదజల్లాయి. అంతేకాదు బెంగళూరులోని ఓ హోటల్ లో వీరిద్దరూ స్టే చేయడం.. అదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య అక్కడికి వెళ్లి రచ్చ చేయడంతో అప్పుడు అది పెద్ద హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అనంతరం లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ నరేష్, పవిత్ర తమ ప్రేమని బహిరంగంగానే బయటపెట్టారు. అప్పటినుంచే ఈ జంటకు టాలీవుడ్ లో స్టార్స్ రేంజ్ కి మించిన పాపులారిటీ వచ్చిందని చెప్పాలి.

ఇక ఈ గొడవల అనంతరం పవిత్ర పాపులారిటీ ఏ లెవెల్ కి చేరిందంటే.. పవిత్ర తమ సినిమాలలో నటిస్తే.. మంచి క్రేజ్ వస్తుందని తక్కువ బడ్జెట్లో సినిమా తీసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయింది పవిత్ర. ప్రస్తుతం పవిత్రకు టాలీవుడ్ లో చేతినిండా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవిత్ర రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి.

 

పవిత్ర ఒక్కరోజు తీసుకునే రెమ్యూనరేషన్.. 50 వేల వరకు ఉంటుందట. అయితే నరేష్ తో తన అనుబంధం బలపడిన తరువాత రెమ్యూనరేషన్ ను డబల్ చేసిందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఒక రోజు కాల్షిట్ కి లక్ష రూపాయలు తీసుకుంటుందట. ఆమెకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలు సైతం ఆమె అడిగినంత డబ్బు ఇస్తున్నారట. ఒక్క దెబ్బతో ఎంత పాపులారిటీని సంపాదించుకుందో అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.