బాలయ్య తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రం బాలయ్య అభిమానులకే కాకుండా సీని ప్రేక్షకులకు సైతం నచ్చటంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లో కూడా ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. బాలయ్య కొత్త సినిమా అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109 వ సినిమా షూటింగ్ని సైతం ప్రారంభించారు. ఈ సినిమా నిమిత్తం తన రెమ్యూనరేషన్ ని పెంచేసినట్లుగా తెలుస్తోంది బాలయ్య.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భగవంత్ కేసరి చిత్రానికి గాను బాలయ్య ఏకంగా 18 కోట్లా రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఇప్పుడు ఆ రెమ్యూనరేషన్ ని 25 కోట్లకు పెంచినట్లుగా తెలుస్తోంది.. వరుస పెట్టి బాలయ్య వరస సినిమాలు చేస్తూ విజయ దిశగా అడుగులు వేయడంతో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వటానికి దర్శక, నిర్మాతలు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాలలో సెట్ లో జరుపుకుంటున్నట్లు సమాచారం.
బాలయ్య ఎంట్రీ సీన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ వేసినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలను సైతం చిత్రీకరించబోతున్నట్లు సమాచారం ఈ సినిమాకే ఈ యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా ఉండబోతున్నాయట. ముఖ్యంగా పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని ప్రచారం వినిపిస్తోంది. ఎప్పటిలాగానే ఈ చిత్రంలో కూడా బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.