చరణ్ దీపావళి పార్టీలో బన్నీకి ఘోర అవమానం… పాపం అంటోన్న ఫ్యాన్స్‌..!

బాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది ఏదైనా పండగ వచ్చినప్పుడు తమ తరుపున ఇండస్ట్రీలో ఉన్న వారిని పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇస్తారు. అలాంటి కల్చర్ చిన్నచిన్నగా మన టాలీవుడ్ కి కూడా అలవాటు అయ్యింది. టాలీవుడ్ హీరోలలో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ఇలాంటి పార్టీలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ పార్టీకి మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున తదితరులు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే వీరు దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ పార్టీలో అంతా సవ్యంగానే జరిగింది కానీ.. అల్లు అర్జున్ మాత్రం వెంకటేష్ తో తప్ప ఇంకెవరితోనూ కలవలేదు. రామ్ చరణ్ కాకుండా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు మంచి స్నేహితులుగా ఎన్టీఆర్ మరియు ప్రభాస్ నిలిచారు. ప్రభాస్ ఈ పార్టీకి రాలేదు కానీ.. వచ్చిన ఎన్టీఆర్ తో మాత్రం అల్లు అర్జున్ చాలా క్లోజ్ గా ఈ పార్టీలో మాట్లాడుతూ వచ్చాడు. కానీ మహేష్ బాబు మాత్రం అల్లు అర్జున్ తో పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదు.

రెండు, మూడుసార్లు కలుపుగోలుగా మాట్లాడడానికి ఎంతగానో బన్నీ ప్రయత్నించినప్పటికీ మహేష్ మాత్రం పెద్దగా మాట్లాడలేదంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చాలా కాలం నుంచి మహేష్ మరియు అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనేది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త. ” సర్లేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురం “సినిమాల మధ్య ఎప్పుడైతే క్లాష్ వచ్చిందో.. అప్పటినుంచి వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ వచ్చిందని సమాచారం.

ఇక పుష్ప సినిమా స్టోరీ ముందుగా మహేష్ దగ్గరికి వెళ్లడం.. అనంతరం కొన్ని మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ ని తీసుకురమ్మని సుకుమార్ కి.. మహేష్ చెప్పడం.. సుకుమార్ మళ్లీ ఆ స్టోరీని మహేష్ కి చెప్పకుండా.. నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లి ఆ స్టోరీని ఓకే చేయించడం జరిగింది. దీనికి మహేష్ బాగా హర్ట్ అయినట్లు వార్తలు సైతం వినిపించాయి. ఈ కోల్డ్ వారే వీరిమధ్య ఇప్పటికీ జరుగుతుందని పలువురు చెబుతున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ కు ఇది పెద్ద అవ‌మాన‌మే అన్న చ‌ర్చ అయితే సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది.