ముఖాన్ని అందంగా, కాంతివంతంగా క‌నిసించ‌టానికి ఈ సింపుల్ చిట్కా మీకోసం..!!

సాధారణంగా చాలామందికి తమ ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరుస్తూ కనిపించాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లో అమ్మే స్కిన్ క్రీమ్స్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే తరచూ ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది పక్కన పెడితే. చర్మం పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే సహజంగానే ముఖాన్ని తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.

ఇప్పుడు చెప్పబోయే చిట్కా అందుకు ఉత్తమంగా సహాయపడుతుంది. ఈ చిట్కాను వాడితే సహజంగానే మీ ముఖం తెల్లగా తయారవుతుంది. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నైట్ నిద్రించేముందు ఒక బౌల్ లో పది బాదం పప్పులు వేసి వాటర్ పోసి నానబెట్టాలి. మరుసటి రోజు చిన్న కీరదోసకాయ తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కీరదోసకాయ ముక్కలు, నానబెట్టుకున్న బాదంతో పాటు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి.

Above view portrait of beautiful mixed-race woman enjoying face massage in luxury spa, copy space

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలో వెరా జెల్, పావు టేబుల్ స్పూన్ టెర్మ‌రిక్‌ పౌడర్, పావు టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత మన శరీరం శుభ్రం చేసుకోవాలి. ఇది అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు ఉంచి వాష్ చేసుకుంటే చాలు ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.