ఓజి లవర్స్ కి అదిరిపోయే అప్డేట్.. గెట్ రెడీ టు మ్యూజికల్ బ్లాస్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ ఓజీ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిన్న సెప్టెంబర్ 2 పవన్ బర్త్‌డే కానుకగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు,

దీనికి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అలాగే సంగీత దర్శకుడు థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి సాలిడ్ రెస్పాన్స్ రాగా ఫ్యాన్స్ అంత స్పెషల్ ట్రాక్ కోసం సోనీ మ్యూజిక్ వారిని డిమాండ్ చేశారు. దీంతో వాళ్లు ఈరోజు ఈ సాలిడ్ మ్యూజిక్ బ్లాస్ట్ ని అందించబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఓజీ మూవీ ఫస్ట్ మ్యూజికల్ బ్లాస్ట్ హంగ్రీ చీతాతో పవర్ స్టార్ 4:05 నిమిషాలకు మన ముందుకు రాబోతున్నాడు. దీంతో ఈ ట్రాక్ ఇప్పుడు ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్‌ని రూల్ చేయడానికి వస్తుంది.

ఇక ఈ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడుతుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తితో అభిమన్లు ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ సాధిస్తుందో..? లేదో..? చూడాలి.