సమంత పై ట్రోల్స్‌.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మ‌యి.. ఆమెని ఆదర్శంగా తీసుకోవాలంటూ కామెంట్స్…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల విజయ్ దేవరకొండ తో కలిసి “ఖుషి” సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే కొంతమంది నేటిజన్స్ సమంత ఖుషి మూవీలో బెడ్ రూమ్ సీన్స్ లో అంతలా నటించడం అవసరమా అంటూ ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సింగర్ చిన్మయి స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టింది.

తనని మీరు ఇంతలా నిందిస్తున్నా.. తనకి వచ్చిన అటోఇమ్యూనిటీ డిజార్డర్ మీకు కూడా వస్తే ఏంటని ఆలోచించి.. దానిపై మీలో అవగాహన కల్పించేందుకు ఒక అడుగు ముందుకు వేసి అందరికీ ధైర్యం నింపడానికి ప్రయత్నిస్తున్న సమంతాను చూసి నేర్చుకోండి. తనను ఎవరు ఎన్ని అంటున్న అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. సమంత పని అయిపోయింది. ఇక ఆమెకు కెరీర్ లేదు అన్న ప్రతి ఒక్కరికి బాలీవుడ్ అండ్ హాలీవుడ్ లో తన ముద్ర వేసి వదిలిచ్చింది.

అలాగే మగజాతి ఆణిముత్యం అని పిలుచుకునే కొంతమంది.. నిజం గమనించలేక కొన్ని రోజుల నుంచి చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. అలాంటివారు మీ ఇంట్లో ఉన్న వారిని దూరంగా పెట్టండి. డబ్బులు సంపాదించలేని వారు ఒకర్ని చాలా దూషిస్తున్నా.. ఏమి మాట్లాడకుండా..? దూషించే వాళ్లకి ఒక ప్లాట్ ఫార్మ్ ఇచ్చి వారి నుంచి కూడా డబ్బు సంపాదించుకునే శాడిస్టిక్ పొజిషన్లో సమాజం నేడు ఉంది. అయితే కర్మ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరిది వారికి ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇచ్చేస్తుంది” అంటూ పెద్ద నోట్ షేర్ చేసింది చిన్మయి.