చంద్రగిరిలో నాని దూకుడు..ఈ సారైనా ఛాన్స్ ఉందా?

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ చంద్రగిరి నియోజకవర్గంలో టి‌డి‌పి గెలిచి చాలా ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడో 1994 ఎన్నికల్లోనే అక్కడ టి‌డి‌పి గెలిచింది. మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. అసలు బాబు రాజకీయం మొదలైంది కూడా ఇక్కడ నుంచే..1978లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు..1983లో టి‌డి‌పి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బాబు టి‌డి‌పిలోకి వెళ్ళడం..కుప్పం నుంచి వరుసగా పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

అయితే చంద్రగిరిలో మాత్రం టి‌డి‌పిక ఛాన్స్ దొరకడం లేదు. 1994లో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు గెలిచారు. అదే టి‌డి‌పి లాస్ట్ గా గెలవడం..మళ్ళీ ఇప్పటివరకు గెలవలేదు. వరుసగా ఓడిపోతూ వస్తుంది. ఇక గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తున్నారు. ఇక్కడ ఆయనకు మంచి పట్టు ఉంది. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. దీంతో ఆయన గెలుపుకు ఎలాంటి ఢోకా లేకుండా పోతుంది. అందుకే ఇక్కడ టి‌డి‌పికి ఛాన్స్ దొరకడం లేదు.

కానీ ఈ సారి ఎన్నికల్లో చెవిరెడ్డి పోటీ చేయడం లేదు..ఆయన తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే తనయుడుని గెలిపించుకునేందుకు చెవిరెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు. కాకపోతే డైరక్ట్ చెవిరెడ్డి పోటీ చేయడం వేరు, ఆయన తనయుడు పోటీ చేయడం వేరు దీని వల్ల టి‌డి‌పి కాస్త పోటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే టి‌డి‌పి ఇంచార్జ్ పులివర్తి నాని..ఇంటింటికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.

ప్రతి ఇంటికి చేరువ్వడమే లక్ష్యంగా నాని పనిచేయనున్నారు..దీని వల్ల టి‌డి‌పికి కాస్త అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కష్టపడితే ఆయనకు చంద్రగిరిలో మంచి అవకాశం దక్కుతుంది. చూడాలి మరి ఈ సారైనా చంద్రగిరిలో టి‌డి‌పికి ఒక్క ఛాన్స్ దొరుకుతుందేమో.