RRR Public talk: ఇండియా సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇదే..!!

యస్..ఇప్పుడు ప్రతి అభిమాన నోట ఇదే మాట వినిపిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా “రణం రౌద్రం రుధిరం”. కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఆశ గా ఎదురు చూసిన సినిమా కొద్ది సేపటి క్రితమే..ప్రపంచవ్యాప్తంగా రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి ఓ స్టోరీ మనం మునుపు ఎన్నడు చూడని విధంగా రాసుకొచ్చారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.

ఆయన కధ ని ఎంత అద్భుతంగా రాసారో..రాజమౌళి అంతకన్నా అధ్బుతంగా తెరకెక్కించాడు. సినిమాలోని ప్రతి సీన్ హైలెట్ గా నిలిచింది. సినిమాకి మెయిన్ హైలెట్..చరణ్-తారక్. ఇద్దరికి ఇద్దరు ఎక్కడా కూడా తీసిపోకుండా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని..భారతీయ సినిమా పెద్ద కలలను కనడమే కాదు, వాటిని నిజం చేసుకోవచ్చని ఈ సినిమా నిరూపించింది అని సినిమా ను చూసి బయటకు వచ్చిన అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఎంతమంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పినా కూడా..RRR టీం కు ఓ భయం ఉండేది. సినిమాలో కామెడీ లేదు రొమాన్స్ లేదు ఇలాంటి దేశభక్తి సినిమాని ప్రజలు నచ్చుతారా..ఆదరిస్తారా అని..కానీ సినిమా రిలీజ్ అయ్యాక అవన్నీ మర్చిపోయారు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం. సినిమా కు అనుకున్న దానికి కన్నా నాలుగు రెట్లు పాజిటివ్ రావడం మరింత ప్లస్ అయ్యింది సినిమాకి. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ రాజమౌళి ఎంతో చక్కగా చూయించారంటూ పొగిడేస్తున్నారు అభిమానులు. అంతేకాదు ప్రతి ఒకరు ఖచ్చితంగా ధియేటర్స్ కు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.