చివరి క్షణాల్లో మహానటి సావిత్రి లా దీనస్థితిని గడిపిన భానుమతి.. కారణం..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటి భానుమతి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేతనంటే ఈమె నటిగానే కాకుండా దర్శకురాలిగా ఎంతో గొప్ప గుర్తింపు సంపాదించుకుంది. వందల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించింది అని చెప్పవచ్చు. హీరోల ను మించి పోయేలా తన క్రేజ్ తో తిరుగులేని నటిగా పేరు పొందింది. ఇక అప్పట్లో భానుమతి తన సినిమాలలో నటిస్తే చాలు కచ్చితంగా ఆ సినిమా విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు నమ్మే వారట. అంతలా తన పేరు పాపులారిటీ అయ్యింది.

అందుచేతనే ఆమె బిజీగా ఉన్నప్పటికీ ఆమె డేట్స్ కోసం ఎంతోమంది ఎన్నో రోజులుగా వెయిట్ చేసేవారు దర్శకనిర్మాతలు.. ఇక ఇంతటి పేరు సంపాదించుకున్న భానుమతి కాస్త గర్వం కూడా ఎక్కువే అని ముద్ర పడిపోయింది. దీనికి గల కారణం ఆమె తీరే అన్నట్లుగా అంటూ ఉంటారు. సాధారణంగా హీరో, హీరోయిన లతో పోలిస్తే ఈమె రెవెన్యూ రేషన్ తక్కువగా ఉంటుందట. అయితే భానుమతి మాత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినిమాలలో నటిస్తున్నది అంటే వారి కంటే ఒక రూపాయి ఎక్కువగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉండేదట.

అందుచేతనే ఈమెకు గర్వం ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే మరికొంతమంది మాత్రం అది గర్వం కాదు కేవలం ఆత్మాభిమానం అని చెబుతూ ఉంటారు. ఇక అలా తిరుగులేని హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రామకృష్ణ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు భరణి కూడా జన్మించారు. అయితే ఇప్పుడు భానుమతి కొడుకు భరణి మాత్రం డాక్టర్ గా విదేశాలలో సెటిల్ అయినట్లుగా సమాచారం. భానుమతి మధ్య వయసులో ఉన్నప్పుడే రామకృష్ణ మరణించారట. కొడుకు అమెరికాలో ఉండడంతో.. ఆమె బాగోగులు చూసుకోవడానికి ఎవరూ లేరట. ఇక ఈమె చివరికి డయాబెటిస్ వ్యాధి ద్వారా లావు అయ్యి తన పనులు తాను చేసుకోలేక చాలా ఇబ్బందులు పడేది అన్నట్లుగా సమాచారం. తన చుట్టూ తన వాళ్లు లేకుండా పోయారని చివరికి చెన్నైలో 80 సంవత్సరాల వయసులో ఆమె మరణించడం జరిగింది. ఈ విషయం తెలిసిన వారందరూ మహానటి సావిత్రిలా చివరి దశలో దీనస్థితిలో చనిపోయింది అని ఎంతో కుమిలిపోయారు.